Sunday, May 24, 2020

*సంతోష‌క‌ర‌మైన జీవితానికి గౌత‌మ బుద్ధుడు చెప్పిన 25 సూత్రాలు..!*

స‌మాజంలో పేద‌లు, ధ‌నికులు ఉంటారు. అంద‌రినీ స‌మానంగా చూడు.
ఒక‌రు ఎక్కువ‌, ఒక‌రు త‌క్కువ అన్న భావం మ‌న‌స్సులోకి రాకుండా చూసుకోవాలి...

సుమారుగా 2500 ఏళ్ల కింద‌ట గౌతమ బుద్ధుడు మాన‌వ జాతి మ‌నుగ‌డ‌కు, స‌రైన జీవ‌న విధానానికి కొన్ని సూచ‌న‌లు చేశాడు...
*కొన్ని నియ‌మాల‌ను పాటించాల‌ని చెప్పాడు.*
కానీ వాటిని మ‌న నిత్య జీవితంలోకి అన్వ‌యించుకుని వాటిని పాటిస్తూ..

సుఖ‌వంత‌మైన, సంతోష‌క‌ర‌మైన జీవ‌నాన్ని గ‌డ‌ప‌వ‌చ్చు.
 మ‌రి మ‌న జీవ‌నం కోసం గౌతమ బుద్ధుడు చెప్పిన ఆ సూత్రాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. మితిమీరిన కోపం ప‌నికిరాదు. కోపం నిన్ను శ‌త్రువును చేసి నిన్ను నాశ‌నం చేస్తుంది. నీ ప‌త‌నానికి నీ కోప‌మే కార‌ణ‌మ‌వుతుంది, క‌నుక కోపం ప‌నికిరాదు, శాంతంగా ఉండాలి.

2. జీవిత ప్ర‌యాణం సాఫీగా సాగుతుంద‌నుకున్న‌ప్పుడు నువ్వు స్వ‌త‌హాగా ఆకాశం కేసి చూసి న‌వ్వుకుంటావు.

3. ప్ర‌పంచంలోని మ‌నుషులంద‌రిలాగే నువ్వు కూడా ఇత‌రుల నుంచి ప్రేమ‌, అనురాగం పొందేందుకు అర్హుడివి.

4. నిజం ఎన్న‌టికీ దాగ‌దు. సూర్య‌, చంద్రులు ప్ర‌కాశించకుండా ఉండ‌లేరు.

5. మ‌న‌స్సులో ఎలాంటి క‌కావిక‌ల‌మైన ఆలోచ‌న‌లు లేకుండా నిర్మ‌లంగా ఉన్న‌వారే శాంత‌మూర్తులు అవుతారు.

6. త‌ప్పు చేసిన వారిని క్ష‌మించండి. వారిని అర్థం చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించండి.
7. ఎవ‌రి జీవితంలో అయినా అతి పెద్ద ఓట‌మి అంటే.. నిన్ను న‌మ్మిన వారికి నిజం చెప్ప‌క‌పోవ‌డ‌మే.

8. ఎలాంటి దారి లేనిచోట నువ్వు న‌డిచే తోవ‌నే దారి అవుతుంది.

9. మంచి మాట‌లు ఎన్ని చెప్పినా, ఎన్ని చ‌దివినా.. వాటిని ఆచ‌ర‌ణలో పెట్ట‌క‌పోతే ప్ర‌యోజ‌నం ఏమీ ఉండ‌దు.

10. శ‌త్రువుల‌ను చూస్తే చ‌క్క‌గా మొరిగే కుక్క‌నే మంచి కుక్క అవుతుంది. అలాగే ఒక మ‌నిషి మంచిగా మాట్లాడితేనే మంచి మ‌నిషి అవుతాడు.

11. మ‌న‌స్సుంటే మార్గ‌ముంటుంది.

12. స‌మాజంలో పేద‌లు, ధ‌నికులు ఉంటారు. అంద‌రినీ స‌మానంగా చూడు. ఒక‌రు ఎక్కువ‌, ఒక‌రు త‌క్కువ అన్న భావం మ‌న‌స్సులోకి రాకుండా చూసుకోవాలి.

13. మంచి మాట‌తీరు, జాలి గుణం, సేవా త‌త్ప‌ర‌త అనేవి మాన‌వ‌త్వానికి ప్ర‌తీక‌లు.

14. ఎట్టి ప‌రిస్థితిలోనూ భ‌య‌ప‌డ‌కూడ‌దు. నీలో ఉండే భ‌యాన్నిఎప్పుడూ పార‌ద్రోలాలి. నువ్వు ఇత‌రుల‌పై ఆధార‌ప‌డ‌కూడ‌దు. నువ్వు చ‌క్క‌గా ఉంటే ఇత‌రుల నుంచి స‌హాయం అర్థించ‌కూడ‌దు. అదే నీ స్వేచ్ఛ‌కు చిహ్నం.

15. ఎలాంటి ప‌రిస్థితి ఎదురైనా.. మ‌న‌కు వ‌చ్చే క‌ష్టాన్ని, స‌మ‌స్య‌ల‌ను మ‌న‌మే ప‌రిష్క‌రించుకోవాలి. ఎవ‌రో వ‌స్తార‌ని, ఏదో చేస్తార‌ని వేచి చూడ‌కూడదు.

16. ఏ ప‌ని చేసినా అంకిత భావంతో, మ‌న‌స్సులో ఎలాంటి చెడు భావాలు లేకుండా చేయాలి.

17. స‌మ‌స్య‌ల‌ను నీకై నువ్వు ప‌రిష్కరించుకో. ఇత‌రుల‌పై ఆధార ప‌డ‌కు.

18. మ‌నం ఏదైతే ఆలోచిస్తామో.. అదే ఆచ‌ర‌ణ‌లో చేస్తాం. క‌నుక ఆలోచ‌న‌లు స‌క్రమంగా ఉండాలి. స‌క్ర‌మ‌మైన ప‌నులు చేస్తాం.

19. నిన్ను న‌వ్వు జ‌యించు. ఆ తరువాత ఇత‌రుల‌ను జ‌యించ‌డం సాధ్య‌మ‌వుతుంది.

20. గొడ‌వ‌లు సృష్టించే 1000 ప‌దాల క‌న్నా శాంతిని తెచ్చే ఒకే ఒక్క ప‌దం మాట్లాడ‌డం ఉత్త‌మం.

21. ఇత‌రుల‌ను ప్రేమించ‌లేని వారు వారి క‌ష్టాల‌ను, స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌లేరు.

22. మానసికంగా దృఢంగా ఉంటేనే శారీర‌కంగా ఆరోగ్యం బాగుంటుంది.

23. మ‌నిషి త‌న‌కు వ‌చ్చే రోగాల‌కు తానే బాధ్య‌త వ‌హించాలి.

24. ఒక కొవ్వొత్తితో 1000 కొవ్వుత్తుల‌ను వెలిగించ‌వ‌చ్చు , అలాగే సంతోషాన్ని  ఎంత మందికి పంచినా త‌ర‌గ‌దు.

25. గ‌తం గురించి ఆలోచిస్తూ విచారించ‌కు. భ‌విష్య‌త్తు ఏమ‌వుతుందోన‌ని ఆందోళ‌న చెంద‌కు. వ‌ర్త‌మానంలో జీవించు.

*ఆరోగ్యం కోసం సూర్యని మంత్రం*

*ఆరోగ్యం కోసం సూర్యని మంత్రం*

*సూర్యమంత్రం:*

*_నమః సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణే!_*
*_ఆయురారోగ్య ఐశ్వర్యo దేహి దేహిదేవః జగత్పతే!!_*

*అర్థం:*

ఓ సూర్యదేవ! జగత్ పరిపాలకా! నీకిదే నా  నమస్కారము. నీవు సర్వరోగములను తొలగించువాడవు, శాంతిని వొసంగువాడవు,
మాకు ఆయువును, ఆరోగ్యమును, సంపదను అనుగ్రహించుము...

సూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవం సూర్యుడు కి నమస్కారం చేసే వారిలో ఇతరుల కన్నా రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుంది ...
నమస్కార ముద్ర కూడా ఒక ఆసనం ,అలా నమస్కారం చేస్తూ 12 సూర్య నామాలు చదివే సమయం లేదా ఇక్కడ ఇచ్చిన ఈ శ్లోకమ్ కనీసం 12 సార్లు అయిన జపిస్తూ సూర్యుడు ఎదురుగా నిల్చుని నమస్కారం చేస్తే నమస్కార ప్రియుడు అయిన సూర్యుడు సంపూర్ణ ఆరోగ్యం అనుగ్రహిస్తారు..
అలాగే ఇతరులతో పోలిస్తే సూర్య నమస్కారం చేసే వారి చుట్టూ రేఖీ అధికంగా ఉంటుంది..
ఈ రెండు వాక్యల చిన్న శ్లోకం పిల్లలకు అలవాటు చేయండి పిల్లలు ఇలా సూర్య నమస్కారం చేయడం వల్ల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి పెరుగుతుంది క్రమశిక్షణ అలవాటు అవుతుంది..

పిల్లలు తల్లితండ్రుల మాట వింటారు..

*శ్రీ సూర్య ద్వాదశ నామాలు*

1.ఓం మిత్రాయనమః
2.ఓం రవయేనమః
3.ఓం సూర్యాయనమః
4.ఓం భానువేనమః
5. ఓం ఖగాయనమః
6. ఓం పూష్ణేనమః
7. ఓం హిరణ్య గర్భాయనమః
8.ఓం మరీచయేనమః
9.ఓం ఆదిత్యా యనమః
10.ఓం సవిత్రేనమః
11. ఓం అర్కాయనమః
12. ఓం భాస్కరాయనమః

ఈ ద్వాదశ నామాలు కూడా స్మరించుకుంటే సూర్యనారాయణుడు ఆశీర్వాదం లభిస్తుంది.

                ||  నమో సూర్య నారాయణ ౹౹

*గర్భగుడిలోకి వెళ్లేముందు గడపకెందుకు నమస్కరిస్తారు............!!🙏*

*గర్భగుడిలోకి వెళ్లేముందు గడపకెందుకు నమస్కరిస్తారు............!!🙏*

సాధారణంగా ఆలయంలో ప్రధాన ద్వారం వద్ద, గర్భగుడిలోకి వెళ్లేముందు ఉన్న గడపలు రాయితో తయారు చేసి ఉంటారు. ఈ గడపకు ప్రతి భక్తుడూ నమస్కరిస్తుంటాడు. ఇలా ఎందుకు నమస్కరిస్తారనే విషయం చాలా మంది భక్తులకు తెలియదు.

వాస్తవానికి గృహాలకు చెక్కతో తయారు చేసిన గడప ఉంటుంది. అలాగే, ఆలయాలకు అయితే రాయితో తయారు చేసిన గడప ఉంటుంది. ఆలయాలకు రాతితోనే ఎందుకు గడపను తయారు చేస్తారు? ఆ ఆలయ గడపకు ఎందుకు నమస్కరించాలి అనే అంశాలను పరిశీలిస్తే...

రాయి పర్వతానికి చెందినది. భద్రుడు అనే ఋషి భద్రమనే పర్వతంగానూ, హిమవంతుడు అనే భక్తుడు హిమాలయముగానూ, నారాయణుడు అనే భక్తుడు నారాయణాద్రిగానూ అవతరించారని పురాణాలు చెపుతున్నాయి. ఈ ఆ భక్తుల కోసం భగవంతుడు కూడా ఆ కొండలమీదే వెలిశాడు. అందుకే ఆ కొండ రాళ్ళ నుంచి వచ్చిన రాయినే మలిచి ఆలయ గర్భగుడులకు గడపగా పెట్టారని శాస్త్రాలు చెపుతున్నాయి.

అయితే, ఆ గడప నిత్యం దైవాన్ని దర్శిస్తూ ఉంటుంది. అలా ఆ గడప రాయి పుణ్యం చేసుకుంది. అందుకే ఆ గడప రాయి చేసుకున్న పుణ్యానికి నమస్కరిస్తూ, కొండ రాయిగా మారిన భక్తుడిని దాటుతున్నందుకు క్షమించమని, మన్నించమని వేడుకోవడమే గడపకు నమస్కరిస్తారని పురాణాలు చెపుతున్నాయి. అందుకే ఆలయాల్లో ప్రధాన గడప తొక్కకుండా కేవలం దాటాలని ఆధ్యాత్మికవేత్తలు సూచిస్తున్నారు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

*_ఆదిత్య హృదయస్తోత్రం_*

*_ఆదిత్య హృదయస్తోత్రం_*

శ్రీమద్వాల్మీకి రామాయణం - యుద్ధ కాండములో శ్రీరామునికి అగస్త్య మహర్షిచే వుపదేశించబడిన *"ఆదిత్య హృదయస్తోత్రం"*

తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ |
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్
 || 1 ||

దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్ |
ఉపగమ్యా బ్రవీద్రామమ్ అగస్త్యో భగవాన్ ఋషిః || 2 ||

రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్|
యేన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి || 3 ||

ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనమ్ |
జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శివమ్ || 4 ||

సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనమ్ |
చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమమ్ || 5 ||

రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతమ్ |
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్
 || 6 ||

సర్వదేవాత్మకో హ్యేషః తేజస్వీ రశ్మిభావనః |
ఏష దేవాసుర గణాన్ లోకాన్ పాతి గభస్తిభిః
|| 7 ||

ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః |
మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః || 8 ||

పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః |
వాయుర్వహ్నిః ప్రజాప్రాణః ఋతుకర్తా ప్రభాకరః || 9 ||

ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్|
సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః || 10 ||

హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తి-ర్మరీచిమాన్ |
తిమిరోన్మథనః శంభుః త్వష్టా మార్తాండ అంశుమాన్
|| 11 ||

హిరణ్యగర్భః శిశిరః తపనో భాస్కరో రవిః |
అగ్నిగర్భోఽదితేః పుత్రః శంఖః శిశిరనాశనః
 || 12 ||

వ్యోమనాథ స్తమోభేదీ ఋగ్యజుఃసామ-పారగః |
ఘనావృష్టి రపాం మిత్రో వింధ్యవీథీ ప్లవంగమః || 13 ||

ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః |
కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వభవోద్భవః
|| 14 ||

నక్షత్ర గ్రహ తారాణామ్ అధిపో విశ్వభావనః |
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్-నమోఽస్తు తే || 15 ||

నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః |
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః || 16 ||

జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః |
నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః || 17 ||

నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః |
నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః
|| 18 ||

బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్య- వర్చసే |
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః || 19 ||

తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయా మితాత్మనే |
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః || 20 ||

తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే|
నమస్తమోఽభి నిఘ్నాయ రుచయే లోకసాక్షిణే || 21 ||

నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభుః|
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః || 22 ||

ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః|
ఏష చైవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్ని హోత్రిణామ్
 || 23 ||

వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ |
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః ||24||


*ఫలశ్రుతిః*🙏🏻

ఏన మాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ |
కీర్తయన్ పురుషః కశ్చిన్-నావశీదతి రాఘవ || 25 ||

పూజయస్వైన మేకాగ్రో దేవదేవం జగత్పతిమ్ |
ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి
|| 26 ||

అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి |
ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతమ్
 || 27 ||

ఏతచ్ఛ్రుత్వా మహాతేజాః నష్టశోకోఽభవత్-తదా |
ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్
|| 28 ||

ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్ |
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ || 29 ||

రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ |
సర్వయత్నేన మహతా వధే తస్య ధృతోఽభవత్
|| 30 ||

అధ రవిరవదన్ నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణః|
నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్త్వరేతి
 || 31 ||

ఇది వినాలంటే ఎన్నో కోట్ల జన్మలు పుణ్యం ఉండాలని చెబుతారు.

మహా అద్భుతం.

ఇది వినాలంటే ఎన్నో కోట్ల జన్మలు పుణ్యం ఉండాలని చెబుతారు.

వీలయినంత ఎక్కువసార్లు ప్రతినిత్యం వినడానికి ప్రయత్నం చెయ్యండి.

దీనిని రోజుకొకసారి వింటే చాలు మీ ఆరోగ్యంలో ఉన్న ఎటువంటి లోపాలనైన నయం చేయగలదని వ్యాసరాయలు చెప్పినది. మీరు వినండి మరియు మీ మిత్రులకు కూడ పంపండి

అందరికీ షేర్ చేయండి

శ్రీహనుమత్స్తోత్రమ్ వ్యాసతీర్థవిరచితమ్ ॥

నమామి దూతం రామస్య సుఖదం చ సురద్రుమమ్ ।
పీనవృత్తమహాబాహుం సర్వశత్రునిబర్హణమ్ ॥ ౧॥

నానారత్నసమాయుక్తకుణ్డలాదివిభూషితమ్ ।
సర్వదాభీష్టదాతారం సతాం వై దృఢమాహవే ॥ ౨॥

వాసినం చక్రతీర్థస్య దక్షిణస్థగిరౌ సదా ।
తుఙ్గామ్భోధితరఙ్గస్య వాతేన పరిశోభితే ॥ ౩॥

నానాదేశాగతైః సద్భిః సేవ్యమానం నృపోత్తమైః ।
ధూపదీపాదినైవేద్యైః పఞ్చఖాద్యైశ్చ శక్తితః ॥ ౪॥

భజామి శ్రీహనూమన్తం హేమకాన్తిసమప్రభమ్ ।
వ్యాసతీర్థయతీన్ద్రేణ పూజితం ప్రణిధానతః ॥ ౫॥

త్రివారం యః పఠేన్నిత్యం స్తోత్రం భక్త్యా ద్విజోత్తమః ।
వాంఛితం లభతేఽభీష్టం షణ్మాసాభ్యన్తరే ఖలు ॥ ౬॥

పుత్రార్థీ లభతే పుత్రం యశోఽర్థీ లభతే యశః ।
విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ ॥ ౭॥

సర్వథా మాస్తు సన్దేహో హరిః సాక్షీ జగత్పతిః ।
యః కరోత్యత్ర సన్దేహం స యాతి నిరయం ధ్రువమ్ ॥ ౮॥

ఇతి శ్రీవ్యాసతీర్థవిరచితమ్ హనుమత్స్తోత్రం సమ్పూర్ణమ్ ।

జై శ్రీరామ.

జై హనుమాన్.